ETV Bharat / sitara

'పుష్ప' రెండో సాంగ్ రిలీజ్.. అలరిస్తోన్న బన్నీ, రష్మిక కెమిస్ట్రీ - Srivalli song

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. దసరా కానుకగా ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'శ్రీవల్లి' అంటూ సాగే ఈ సాంగ్ అలరించేలా ఉంది.

Srivalli son
శ్రీవల్లి
author img

By

Published : Oct 13, 2021, 11:28 AM IST

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు దసరా కానుక రెండురోజుల ముందే వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా పుష్పరాజ్‌ పాత్రలో నటిస్తున్న 'పుష్ప' సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. 'చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే' అంటూ సాగే ఈ పాటను తాజాగా చిత్రబృందం సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంది. తన ప్రేయసి శ్రీవల్లి(రష్మిక) చూపులకు ముగ్ధుడై.. ఆమెపై తనకున్న ప్రేమను పుష్పరాజ్‌ తెలియజేస్తున్నట్లు ఈ పాటను తీర్చిదిద్దారు. దేవిశ్రీ స్వరాలు అందించగా సిద్ధ్‌ శ్రీరామ్‌ ఈ పాటను అలపించారు. మరోవైపు ఇప్పటికే విడుదలైన 'దాక్కో దాక్కో మేక' పాట సినీ ప్రియుల్ని ఎంతగానో అలరిస్తోంది.

'ఆర్య', 'ఆర్య-2' తర్వాత బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఇందులో బన్నీ.. ఎర్రచందనం స్మగ్లర్‌గా ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మొదటిసారి రష్మిక.. బన్నీతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఇందులో ఆమె శ్రీవల్లి పాత్రలో పుష్పరాజ్‌ ప్రేయసిగా సందడి చేయనున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈచిత్రాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: పూజా హెగ్డే సొగసుల వల.. అభిమానుల విల విల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.