అక్షయ్ ఖన్నా, రిచా చద్దా ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'సెక్షన్ 375'. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. సెప్టెంబర్ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. మొదట ఆగస్టు 2న విడుదల చేయాలనుకున్నారు.
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అత్యాచార సంబంధిత నేరాలకు ఈ సెక్షన్ ద్వారా శిక్షిస్తారు. ఈ సెక్షన్ ఏ విధంగా దుర్వినియోగమవుతుందో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేయనున్నట్టు సమాచారం. మీరా చోప్రా, రాహుల్ భట్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
సెక్షన్ 375లో అక్షయ్ ఖన్నా, రిచా తొలిసారిగా కలిసి నటించారు. అజయ్ బాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పనోరమ స్టూడియోస్ బ్యానర్‌పై కుమార్ మంగత్ పాతక్, అభిషేక్ పాతక్ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చాడు.
ఇది చదవండి: 'పవర్‌స్టార్ అడిగారని ఆ టైటిల్ ఇచ్చేశాం'