ETV Bharat / sitara

'మీర్జాపూర్‌' నిర్మాతలకు సుప్రీం నోటీసులు - Supreme notices to Mirzaprur

'మీర్జాపూర్​' వెబ్‌సిరీస్‌ నిర్మాతలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఉత్తరప్రదేశ్‌, మీర్జాపూర్‌ ప్రాంతీయ వాసుల మనోభావాలు దెబ్బతీసేలా ఇందు‌లో చాలా సన్నివేశాలు ఉన్నాయంటూ అరవింద్‌ చతుర్వేది ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం సదరు సిరీస్​ నిర్మాతలకు నోటీసులు ఇచ్చింది.

SC notice to Centre, others on plea against web series ‘Mirzapur'
'మిర్జాపూర్‌'కు సుప్రీం కోర్టు నోటీసులు
author img

By

Published : Jan 22, 2021, 8:44 AM IST

ఈ మధ్యకాలంలో ఓటీటీల వేదికగా అలరిస్తున్న వెబ్‌సిరీస్‌లలో 'మీర్జాపూర్ 2‌' ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నగరంలో రౌడీ రాజకీయాలు, హత్యలు, అక్రమ వ్యాపారాల నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. మొదటి సీజన్‌ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడం వల్ల రెండో సీజన్‌ను కూడా విడుదల చేశారు. కొత్త సీజన్​ కూడా ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది. ఈ వెబ్​సిరీస్​పై ఇటీవలే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో..​ దీని‌ నిర్మాతలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.

అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌తో పాటు మీర్జాపూర్‌ ప్రాంతీయ మనోభావాలు, మతవిశ్వాసాలను దెబ్బతీయడం, హింసను ప్రేరేపించేలా వెబ్‌సిరీస్‌లో చాలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ నగరానికి చెందిన అరవింద్‌ చతుర్వేది స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సుప్రీం కోర్టులో పిటిషన్‌నూ దాఖలు చేశారు. పిల్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. వెబ్ సిరీస్ నిర్మాత, అమెజాన్ ప్రైమ్ వీడియోకు నోటీసులు జారీ చేసింది. వెంటనే తమ స్పందన తెలియజేయాలని కోరింది. పిటిషనర్‌ ఇచ్చిన జాబితాలో మీర్జాపూర్ నిర్మాతలు రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్, భౌమిక్ గొండాలియా పేర్లున్నాయి.

ఈ వెబ్‌సిరీస్‌లో తమ నగరాన్ని చెడుగా చూపించి.. మీర్జాపూర్‌ పేరును భ్రష్టుపట్టిస్తున్నారంటూ గతంలో స్థానిక ఎంపీ అనుప్రియపటేల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెబ్‌సిరీస్‌పై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్‌ నటి కంగన రనౌత్​ కూడా ఈ వెబ్‌సిరీస్‌ను వ్యతిరేకించింది. ఇందులో పాత్రలను అన్వయించుకొని ఓ యువకుడు ప్రేమపేరుతో ఓ యువతిని హత్య చేసినట్లు తేలడం వల్ల కంగన ఈ సిరీస్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఇది రెండో వెబ్​సిరీస్​

ఇటీవల కాలంలో ఓ వెబ్‌సిరీస్‌ వివాదంలో ఇరుక్కోవడం ఇది రెండోసారి. సైఫ్‌ అలీఖాన్‌ నటించిన ‘తాండవ్‌’ వివాదాల్లో ఇరుక్కొని క్షమాపణలు చెప్పింది. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదురుకావడం వల్ల సిరీస్‌లో మార్పులు చేస్తున్నట్లు డైరెక్టర్‌ ప్రకటించారు. 'మీర్జాపూర్‌' సిరీస్ ఇప్పుడు వివాదాల్లోకి ఎక్కింది. అయితే.. ఈ రెండు వెబ్‌సిరీస్‌లూ అమెజాన్‌ ప్రైమ్‌లోనే ప్రసారం అవుతుండటం గమనార్హం. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌కు గుర్మీత్‌సింగ్‌ దర్శకత్వం వహించారు. పంకజ్‌త్రిపాఠి, అలీఫజల్‌, దివ్యెందు శర్మ, శ్వేతాత్రిపాఠి, రసికా దుగల్‌ కీలక పాత్రల్లో నటించారు.

ఇదీ చూడండి: 'మీర్జాపుర్' వెబ్ సిరీస్​పైనా పోలీసు కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.