ETV Bharat / sitara

సెకండ్​ వేవ్ తర్వాత థియేటర్లలోకి తొలి తెలుగు సినిమా - టాలీవుడ్ మూవీ రిలీజ్

కరోనా రెండో దశ ప్రభావం, లాక్​డౌన్ తర్వాత విడుదల కానున్న తొలి సినిమా 'తిమ్మరుసు'. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు పోస్టర్​ను గురువారం విడుదల చేశారు. అయితే ప్రభాస్ 'రాధేశ్యామ్', నాగచైతన్య 'లవ్​స్టోరి'తో పాటు ఇతర చిత్రాల విడుదలపై త్వరలో స్పష్టత రానుంది!

SATYADEV THIMMARUSU RELEASE
మూవీ రిలీజ్ లేటెస్ట్
author img

By

Published : Jul 8, 2021, 6:05 PM IST

సెకండ్ వేవ్ ప్రభావంతో మూతబడిన సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. గురువారం(జులై 8) నుంచి ఏపీలో 50 శాతం సామర్ధ్యంతో, తెలంగాణలో 100 శాతం ప్రేక్షకులు వచ్చేందుకు అవకాశమిచ్చింది. ఇప్పుడు రెండోదశ లాక్​డౌన్ తర్వాత విడుదలకానున్న తొలి సినిమాగా సత్యదేవ్ 'తిమ్మరుసు' నిలవనుంది. ఈ మేరకు చిత్రబృందం గురువారం ప్రకటన చేసింది. జులై 30న సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మిగతా చిత్రాల రిలీజ్ డేట్స్ కూడా త్వరలో ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

SATYADEV THIMMARUSU RELEASE
సత్యదేవ్ తిమ్మరుసు మూవీ

'లవ్​స్టోరి', 'రాధేశ్యామ్' ఎప్పుడు?

అయితే జులై 30నే తమ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రభాస్ 'రాధేశ్యామ్' నిర్మాతలు ఎప్పుడో చెప్పారు. ఇప్పటివరకు రిలీజ్ డేట్​ మార్పుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆరోజునే తమ డార్లింగ్ హీరో సినిమా వచ్చేస్తుందంటూ అభిమానులు సంతోషపడుతున్నారు.

prabhas radhe shyam movie
ప్రభాస్ 'రాధేశ్యామ్'

జులై చివరి వారంలోనే నాగచైతన్య-సాయిపల్లవి 'లవ్​స్టోరి' చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'తిమ్మరుసు' రిలీజ్ డేట్​ చెప్పిన నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి. దీంతో ఇతర చిత్రాల విడుదల తేదీలపైనా త్వరలో స్పష్టత రానుంది.

sai pallavi lovestory movie
నాగచైతన్య సాయిపల్లవి 'లవ్​స్టోరి'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.