యువ కథానాయకుడు సత్యదేవ్.. సూపర్ ఛాన్స్ కొట్టేశాడు! మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఇతడు 'లూసిఫర్' రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై తెగ మాట్లాడేసుకుంటున్నారు.
ఇటీవల ఈ రీమేక్‌ను అధికారికంగా ప్రకటించారు. తమిళ డైరెక్టర్ మోహన్‌రాజా.. దీనిని తెరకెక్కించనున్నారు. ఈనెల చివరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడించే అవకాశముంది.
ప్రస్తుతం 'ఆచార్య'తో బిజీగా ఉన్న చిరు.. 'లూసిఫర్' రీమేక్, ఆ తర్వాత 'వేదాళం' రీమేక్‌లో నటిస్తారు. సత్యదేవ్.. 'తిమ్మరుసు', 'గుర్తుందా శీతాకాలం' తదితర చిత్రాలు చేస్తున్నారు.

ఇవీ చదవండి: