ETV Bharat / sitara

చరణ్-శంకర్ మూవీ అప్​డేట్.. 'సార్​పట్ట' ట్రైలర్​ - శంకర్​ సాయి మాధవ్ బుర్రా

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీకి డైలాగ్ రైటర్​గా సాయి మాధవ్​ను తీసుకున్నారు. అలాగే పా రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా రూపొందిన చిత్రం 'సార్​పట్ట'. జులై 22న అమెజాన్ ప్రైమ్​లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేశారు.

ram cahran
రామ్ చరణ్
author img

By

Published : Jul 13, 2021, 1:05 PM IST

'కబాలి', 'కాలా' చిత్రాలతో తెలుగులోనూ విశేష ఆదరణ పొందారు తమిళ దర్శకుడు పా రంజిత్‌. ఇప్పుడు ఆయన నుంచి 'సార్‌పట్ట' అనే చిత్రం రాబోతుంది. ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. జులై 22 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఆర్య లుక్స్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు అందుకునేలా ట్రైలర్‌ని తీర్చిదిద్దారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్​ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే కథ పూర్తవగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు సాయి మాధవ్. 'కృష్ణం వందే జగద్గురం', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'కంచె', 'గోపాలా గోపాలా', 'సైరా' వంటి చిత్రాలకు మాటలనందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారీయన.

  • జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు
    శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి
    చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను ..
    Thanks to Sankar sir..
    Thanks to Dil Rajugaru.. and
    Thanks to our
    Mega Power Star Charanbabu🙏🙏🙏 pic.twitter.com/iswy0DabmG

    — Saimadhav Burra (@saimadhav_burra) July 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి: 'రాక్షసుడు' సీక్వెల్​.. 'నవరస' రొమాంటిక్​ సాంగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.