ETV Bharat / sitara

సంక్రాంతి సందడికి సిద్ధమైన 'సూపర్​స్టార్​' - సంక్రాంతికి సర్కారువారి పాట

స్టార్​ హీరోల సినిమాల విడుదల తేదీ ప్రకటనలతో టాలీవుడ్​లో ప్రస్తుతం సందడి నెలకొంది. ఈ అప్​డేట్స్​ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఇప్పుడీ జాబితాలో సూపర్​స్టార్ మహేశ్​బాబు వచ్చి చేరారు. ఆయన నటిస్తోన్న కొత్త చిత్రం 'సర్కారువారి పాట' విడుదలపై క్లారిటీ ఇచ్చారు.

sarkaru vari paata movie will be releasing on sankranti
సంక్రాంతి సందడి సిద్ధమైన 'సూపర్​స్టార్​'
author img

By

Published : Jan 29, 2021, 3:45 PM IST

అగ్ర కథానాయకులందరూ తమ సినిమాల విడుదల తేదీని ప్రకటిస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలోకి మహేశ్‌బాబు కూడా వచ్చి చేరారు. ఆయన కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సర్కారువారి పాట'. కీర్తి సురేశ్‌ కథానాయిక. లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైన చిత్రీకరణ ఇటీవల దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.

'సర్కారువారి పాట' చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తాళాల గుత్తి పట్టుకున్న మహేశ్‌ చేతి పోస్టర్‌ను విడుదల చేశారు.

"సూపర్‌స్టార్‌' సంక్రాంతి మరోసారి రానుంది. 'సర్కారువారి పాట'ను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం."

- ట్విటర్‌లో చిత్ర బృందం

మైత్రీమూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. గతేడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో మహేశ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. మరోసారి సంక్రాంతి బరిలోకి మహేశ్‌ దిగుతుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'నారప్ప' ఉగ్రరూపం చూసేది అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.