సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. ప్రస్తుతం దుబాయ్‌లో షూటింగ్ జరుపుకొంటోంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట సందడిగా మారింది.
ఈ చిత్రం నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమైందట చిత్రబృందం. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారని టాలీవుడ్ టాక్. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.