సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందణ్న కలిసి నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు'.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31న విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం.
ఈ చిత్రంలో ఆర్మీ అధికారి మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు మహేశ్. సీనియర్ కథానాయిక విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై... రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకానుందీ సినిమా.
ఇవీ చూడండి.. ఇటు అఖిల్.. అటు ప్రభాస్.. పరశురామ్ దారెటు..!