ETV Bharat / sitara

హీరోయిన్ సారా అలీ ఖాన్ డ్రైవర్​కు కరోనా - సారా అలీ ఖాన్ వార్తలు

తన డ్రైవర్​కు ప్రాణాంతక కరోనా సోకిందని తెలిపింది బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్. ఈ మేరకు ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది.

సారా అలీ ఖాన్ డ్రైవర్​కు కరోనా
హీరోయిన్ సారా అలీఖాన్
author img

By

Published : Jul 14, 2020, 7:57 AM IST

బాలీవుడ్​లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవలే అమితాబ్​, అనుపమ్ ఖేర్​ల కుటుంబం ఈ వైరస్​ బారిన పడగా.. ఇప్పుడు​ హీరోయిన్ సారా అలీ ఖాన్ డ్రైవర్​కు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్​స్టాలో పంచుకుంది. ప్రస్తుతం అతడు క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపింది. అయితే వైద్య పరీక్షల్లో తన కుటుంబానికి మాత్రం నెగిటివ్​ వచ్చినట్లు వెల్లడించింది.

ఈ మధ్యే అమితాబ్​తో పాటు ఆయన కుటుంబంలోని అభిషేక్, ఐశ్వర్యా రాయ్​, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో బిగ్​బీ ఇంటిని సీల్​ చేయడం సహా ఆయన నివసిస్తున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించింది ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.

అదే రోజు సీనియర్ నటుడు అనుపమ్​ ఖేర్​ తల్లితో పాటు సోదరుడి ఇంట్లో ముగ్గురు వైరస్​ బారిన పడ్డారు. నటి రేఖ సెక్యూరిటీ సిబ్బందికీ కరోనా సోకడం వల్ల ఆమె బంగ్లాను మూసివేశారు బీఎంసీ అధికారులు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.