ETV Bharat / sitara

విజయ్​దేవరకొండ చాలా హాట్​: సారా అలీఖాన్​ - సారా అలీఖాన్​ విజయ్​ దేవరకొండ

Sara ali khan Vijay devarakonda: రౌడీహీరో విజయ్​దేవరకొండ తన ఫేవరెట్​ స్టార్​ అని చెప్పింది బాలీవుడ్​ బ్యూటీ సారా అలీఖాన్​. ఆయనతో సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాట చెప్పింది. దీంతో పాటే విజయ్​ చాలా హాట్​గా ఉంటారని పేర్కొంది.

విజయ్​దేవరకొండ సారా అలీఖాన్​, Sara Ali Khan  Vijay Devarakonda
విజయ్​దేవరకొండ సారా అలీఖాన్​
author img

By

Published : Dec 11, 2021, 2:17 PM IST

Sara ali khan Vijay devarakonda: బాలీవుడ్​ యువ హీరోయిన్​ సారా అలీఖాన్​ టాలీవుడ్​ రౌడీహీరో విజయ్​దేవరకొండపై ప్రశంసలు కురిపించింది. విజయ్​ తన ఫేవరెట్​ స్టార్​ అని, ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని తమ మనసులో మాటను తెలిపింది. ​సారా నటించిన కొత్త చిత్రం 'అత్రాంగి రే' డిసెంబరు 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. దక్షిణాదిలో ఏ హీరోతో సినిమా చేయాలని ఉందని అడగ్గా.. ఈ విషయాన్ని చెప్పింది. దీంతో పాటే విజయ్​ చాలా హాట్​గా ఉంటారని చెప్పింది.

కాగా, లైగర్​ సినిమా నిర్మాణంలో భాగంగా ప్రొడ్యూసర్​ కరణ్ జోహార్​ ఇచ్చిన ఓ పార్టీలో విజయ్​-సారా కలుసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ కలిసి దిగిన సెల్ఫీని సారా తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. అప్పుడు అది వైరల్​గా మారింది.

ప్రస్తుతం విజయ్​ పూరీజగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లైగర్'​ చిత్రంలో నటిస్తున్నారు. అనన్యా పాండే హీరోయిన్​. దిగ్గజ బాక్సర్​ మైక్​టైసన్​ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: విజయ్​ దేవరకొండతో సారా 'ఫ్యాన్ మూమెంట్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.