ETV Bharat / sitara

సంక్రాంతి వైపే సినీ పరిశ్రమ చూపు! - సంక్రాంతి బరిలో సినిమాలు

సంక్రాంతి.. బడా చోటా హీరోల సినిమాలు పోటాపోటీగా వరుసగా విడుదలై వసూళ్లు కురిపిస్తుంటాయి. కానీ ఈసారి కరోనా వల్ల రాబోయే పండగా ప్రణాళికంతా తారుమారైపోయింది. ఒకవేళ పండగ సమయానికి థియేటర్లు తెరిస్తే ఏ హీరో చిత్రం విడుదలవొచ్చు. పరిశ్రమలో ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి? వంటి విశేషాలు తెలుసుకుందాం.

big heroes
బడాహీరోలు
author img

By

Published : Jul 4, 2020, 6:38 AM IST

సంక్రాంతి అనగానే కొత్త సినిమాలే గుర్తుకొస్తాయి. నెల రోజులకు పైగా సాగే ఆ సీజన్‌లో అగ్ర హీరోల చిత్రాలు పోటాపోటీగా విడుదలవుతాయి. మంచి వసూళ్లకు.. సరికొత్త రికార్డులకు పెట్టింది పేరైన సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కే చిత్రాలు చాలానే! అయితే అన్ని సినిమాలూ అనుకున్న సమయానికి రావు. చిత్రీకరణలో ఆలస్యం చోటు చేసుకోవడం.. విడుదల ప్రణాళికల్లో మార్పులతో ఎవరూ ఊహించని సినిమాలు సంక్రాంతికి విడుదలవుతుంటాయి. అప్పటిదాకా రేసులో ఉన్న సినిమాలేమో వెనక్కి వెళ్లిపోతుంటాయి. వచ్చే సంక్రాంతి కోసం 'ఆర్‌ఆర్‌ఆర్‌' మొదలు పలు చిత్రాలు ప్రణాళికలు వేసుకున్నాయి. ఈసారి కరోనాతో ఆ ప్రణాళికలు తారుమారయ్యాయి. థియేటర్లు తెరిస్తే వచ్చే పండగకి ఎవరి హంగామా ఉండొచ్చు? పరిశ్రమలో ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి?

చిత్రసీమ 2020పై దాదాపుగా ఆశలు వదిలేసినట్టే. కరోనా విజృంభణ తగ్గకపోవడం వల్ల థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. తెరిచినా ప్రేక్షకులు థియేటర్లలోకి ధైర్యంగా అడుగు పెడతారో లేదో అనే సందేహం. ప్రేక్షకుల్ని థియేటర్లకి ఆకర్షించే సంక్రాంతి నుంచే మళ్లీ సినిమాల హంగామా మొదలు కావొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే మన సినిమా సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆయా దర్శకనిర్మాతలు సమాలోచనలు చేస్తున్నారు. అందుకోసం ప్రణాళికలు రచించుకుంటున్నారు. చిత్రీకరణలు ఇంకా ఊపందుకోలేదు.

big heroes
బడాహీరోలు

'వకీల్‌సాబ్‌' అప్పుడేనా?

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'వకీల్‌సాబ్‌'. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తుండగా, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ వేసవిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో అది సాధ్యం కాలేదు. ఇంకా 30 శాతం చిత్రీకరణ మిగిలి ఉన్నట్టు సమాచారం. ఆ భాగాన్ని, నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాత దిల్‌రాజు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. చిత్రీకరణ కోసం సెట్స్‌పైకి వెళ్లే సమయాన్నిబట్టి దానిపై ఓ స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. చిరంజీవి కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ కూడా 40 శాతం పూర్తయింది. మొదట ఈ సినిమా కూడా సంక్రాంతి రేసులో కనిపించింది. సినిమా పునః ప్రారంభమయ్యే దాన్నిబట్టి విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే సంక్రాంతికి ‘వకీల్‌సాబ్‌’ విడుదలైతే ‘ఆచార్య’ మరో తేదీని చూసుకోవాల్సిందే. అన్నదమ్ములిద్దరి సినిమాలు ఒకేసారి బరిలోకి దిగే అవకాశాలు లేవు.

pawan
పవణ్​కల్యాణ్​

వాటి దారెటు?

వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న 'నారప్ప' సినిమా సింహభాగం పూర్తయింది. మరో షెడ్యూల్‌తో ఆ సినిమా పూర్తవనున్నట్టు సమాచారం. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లిదంటే 'నారప్ప' కూడా సంక్రాంతి రేసులో నిలిచినట్టే. నాగార్జున ‘వైల్డ్‌డాగ్‌’ సినిమా కూడా చివరి దశకు చేరుకుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఆ సినిమా సంక్రాంతి రేసులో నిలుస్తుందా లేక నాగార్జున సినిమాలు ఎక్కువగా విడుదలయ్యే డిసెంబరులోనా అనేది చూడాలి. ఈ విషయాలన్నీ కూడా చిత్రీకరణలు, థియేటర్లు తెరుచుకోవడంపైనే ఆధారపడి ఉన్నాయి.

వేగం కొనసాగితే...

దర్శకులంతా వేగానికి ప్రాధాన్యమిస్తున్నారు. సెట్స్‌పైన సినిమా ఎక్కువ రోజులు ఉండకుండా, వేగంగా పూర్తి చేస్తున్నారు. సుకుమార్‌ కూడా ఈసారి 'పుష్ప' సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుని ప్రణాళికలు రచించారు. కానీ కరోనా ఆ ప్రణాళికల్ని తారుమారు చేసింది. ఈ విరామంలో స్క్రిప్టుతో పాటు సాంకేతిక సన్నాహాల పరంగా దర్శకులంతా పక్కాగా సిద్ధమై ఉంటారు కాబట్టి కొత్త చిత్రాలు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశాలే ఉన్నాయి. అదే జరిగితే సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ మొదటి ప్రాధాన్యం మాత్రం సెట్స్‌పై ఉన్న సినిమాలకే. ఆ తర్వాత కొత్త చిత్రాలు ప్రారంభం అవుతాయి. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వేగంగా చిత్రీకరణ పూర్తయితే ఆయన కూడా పండగ బరిలో నిలవొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. అగ్ర కథానాయకుల చిత్రాలతో పాటు.. పరిమిత వ్యయంతో తెరకెక్కే యువ హీరోల సినిమాలు కూడా ఒకట్రెండు రేసులో నిలవచ్చు.

allu
అల్లుఅర్జున్​

ఇది చూడండి : ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా పిలిచే వ్యక్తి కీరవాణి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.