ETV Bharat / sitara

తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిన 'శంకరాభరణం'

తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన కళాత్మక దృశ్య కావ్యం 'శంకరాభరణం'. 1980, ఫిబ్రవరి 2లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఈ కళాఖండం విడుదలై భాషా ఎల్లలు దాటి ఎంతమందికో అభిమాన చిత్రంగా నిలిచింది. కళా తపస్వి కె.విశ్వనాథ్​ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు, మరెన్నో గౌరవాలు లభించాయి. విదేశాల్లో జరిగిన చిత్రోత్సవాల్లో సైతం కీర్తి పతకం సాధించింది. ఈ సినిమా విడుదలై 41 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం.

Sankarabaranam
'శంకరాభరణం'‌
author img

By

Published : Feb 2, 2021, 5:30 AM IST

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం, 'శంకరాభరణం' చిత్రం విడుదలయ్యి నేటికి 41 సంవత్సరాలు పూర్తయ్యింది. 1980, ఫిబ్రవరి 2న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రం విడుదలయ్యింది. కళాతపస్వి శ్రీ కే. విశ్వనాథ్​ దర్శకత్వంలో, పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై శ్రీ ఏడిద నాగేశ్వరరావు - ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఈ చిత్రం ఇక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించింది . అమెరికా లో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి తెలుగు చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలుమూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలయ్యి, తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఈ చిత్రం. ఆ రోజుల్లో ఎవరి నోట విన్న శంకరాభరణం గురించే ప్రస్తావన. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరవైన రోజుల్లో.. ఈ చిత్రం విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు. ప్రతి తెలుగు వాడు మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.

ఇక అవార్డుల విషయానికి వస్తే, జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు, వినోదాత్మకంతో జనరంజక చిత్రంగా 'స్వర్ణ కమలం' అందుకుంది. స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రమిదే కావటం విశేషం. అలాగే గాయకులు శ్రీ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకునిగా తొలి సారి జాతీయ అవార్డు , శ్రీమతి వాణి జయరాం కు ఉత్తమ గాయకురాలిగా, శ్రీ కే.వి.మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఫ్రాన్స్) లో ఉత్తమ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు అందుకుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు 8 గెలుచుకుంది. ఇక దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి. ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శంకరాభరణం చిత్రంపై మూడు రోజులు ప్రవచనాలు చేశారు. అలా ఓ చిత్రంపై ప్రవచనం నిర్వహించటం అదే మెదటి సారి.

Sankarabaranam
'శంకరాభరణం'‌

ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చిందీ చిత్రం. జె.వి. సోమయాజులు గార్ని అందరూ శంకరాభరణం శంకరశాస్త్రి అనే పిలిచేవారు. అలాగే వాంప్ పాత్రలు ఎక్కువగా చేసే మంజు భార్గవి చాలా పవిత్రమైన తులసి పాత్రలో లీనమైపోయింది. ప్రముఖ హాస్య నటులు శ్రీ అల్లు రామలింగయ్య ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర పాటలు ఇప్పటికీ భాషతో సంబంధం లేకుండా అందర్ని ఆకట్టుకుంటాయి. ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై, హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు.

Sankarabaranam
'శంకరాభరణం'‌

కథేమిటి?

శంకరశాస్త్రి (జె. వి. సోమయాజులు) గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వేశ్య కూతురు, గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్త్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తూలనాడిన విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. ఈ కేసు నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి శంకర శాస్త్రి అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో తులసిని విడిపిస్తాడు. వేశ్యకు ఆశ్రయం ఇచ్చారని శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూస్తారు.

తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరవై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక పుత్రుడికి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర నేర్చుకోవడానికి అతన్ని పంపిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును ఆయన సంగీతానికి వారసుడిగా నియమిస్తుంది. కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ఆమె కూడా ప్రాణాలువిడుస్తుంది.

Sankarabaranam
'శంకరాభరణం'‌

నటీ నటులు

జె.వి .సోమయాజులు

మంజు భార్గవి

అల్లు రామలింగయ్య

చంద్ర మోహన్

రాజ్యలక్ష్మి

తులసి

నేపథ్య గానం

ఎస్ .పి.బాలసుబ్రహ్మణ్యం

ఎస్. జానకి

వాణి జయరాం

Sankarabaranam
'శంకరాభరణం'‌
Sankarabaranam
'శంకరాభరణం'‌
Sankarabaranam
'శంకరాభరణం'‌

ఇదీ చూడండి: 90వ పడిలోకి అడుగుపెట్టిన సంగీత పిపాసి కె.విశ్వనాథ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.