ETV Bharat / sitara

మరో వైవిధ్యమైన కథతో సిద్ధమైన సంకల్ప్​ - Sankalp Reddy's new movie with Indian Air Force storyline

భారత వాయుసేనకు సంబంధించిన వాస్తవ ఘటనల ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు స్పష్టం చేశారు దర్శకుడు సంకల్ప్​రెడ్డి. కరోనా సంక్షోభ పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలిపారు.

Sankalp Reddy's new movie with Indian Air Force storyline
మరో వైవిధ్యమైన కథతో సిద్ధమైన సంకల్ప్​
author img

By

Published : Jul 1, 2020, 8:00 AM IST

'ఘాజి', 'అంతరిక్షం' వంటి వైవిధ్యభరిత చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంకల్ప్‌ రెడ్డి. మూడో చిత్రాన్ని బాలీవుడ్‌లో చేయబోతున్నారు. విద్యుత్‌ జమ్వాల్‌ కథానాయకుడిగా నటించనున్నారు. ఓ చక్కటి యాక్షన్‌ కథాంశంతో దీన్ని తెరకెక్కించబోతున్నారు. తాజాగా ఈ చిత్ర విషయమై సంకల్ప్‌ స్పష్టతనిచ్చారు.

"ఏడాది క్రితమే ఈ ప్రాజెక్టు అనుకున్నాం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన కథాంశంతో కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధమైపోయింది. షూటింగ్‌కు వెళ్దామనుకుంటున్న సమయంలోనే కరోనా - లాక్‌డౌన్‌ అడ్డొచ్చాయి. మళ్లీ పరిస్థితులు చక్కబడిన వెంటనే రంగం సిద్ధం చేసుకోవాలి."

- సంకల్ప్​రెడ్డి, దర్శకుడు

తర్వాతి ప్రాజెక్టులేంటి అని ప్రశ్నించగా.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ వెబ్‌సిరీస్‌ రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ఈషా రెబ్బా నటించింది. బాలీవుడ్‌లో మరో ప్రాజెక్టుకు కమిట్‌మెంట్‌ ఉందని, అదెప్పుడు కార్యరూపం దాల్చుతుందనేది ఇప్పుడే చెప్పలేనన్నారు.

ఇదీ చూడండి... 'మాయాబజార్', 'పాతాళభైరవి' ఘనతంతా ఆయనదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.