'కేజీఎఫ్-2'లో అధీరా పాత్రకు నటుడు సంజయ్ దత్ తప్ప వేరే ఆలోచనే లేదని అన్నాడు చిత్ర కథానాయకుడు యశ్. అతడైతేనే పాత్రకు న్యాయం జరుగుతుందని భావించినట్లు చెప్పాడు.
" అధీరా పాత్ర అనుకున్నప్పుడే సంజయ్ దత్ అయితే సరిపోతారని భావించాం. కేవలం కన్నడలోనే తీద్దామని అనుకున్నప్పుడు ఆయన అయితేనే బాగుంటారని చిత్రబృందం అంతా దృఢంగా నిశ్చయించుకున్నాం. మొదటి భాగం కోసం సంప్రదించాం. అయితే డేట్స్ కుదరక అందులో నటించలేనని చెప్పారు. అందువల్లే ముఖం కనపడకుండా కేవలం చేతిని మాత్రమే చూపించాం".
-- యశ్, సినీ నటుడు
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన అధీరా పాత్ర ఫస్ట్‌లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గతేడాది విడుదలైన ‘కేజీఎఫ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కొనసాగింపుగా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరగుతోంది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
ఇది సంగతి: భారతీయుడు 2 చిత్రంలో పాల్గొననున్న కమల్!