తన సతీమణి మాన్యతా దత్, ఇద్దరు పిల్లలు దుబాయ్‌లో చిక్కుకున్నారని బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో అనేక దేశాలు లాక్‌డౌన్ విధించాయి. రాకపోకల్ని పూర్తిగా నిషేధించాయి. భారత్‌లో లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు సంజయ్ దత్ భార్య, పిల్లలు దుబాయ్ వెళ్లారు. ఆపై ఇక్కడికి వచ్చేందుకు వీలులేక, అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ముంబయిలో తాను ఒంటరిగా ఉంటున్నానని సంజయ్‌దత్ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో అన్నాడు.
"గతంలో పలు మార్లు కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉన్నా. ఇప్పుడు కూడా అదే జరిగింది. నేను నా కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్నా. నా సర్వస్వం వాళ్లే. రోజులో పలుమార్లు వారిని చూసి, మాట్లాడగలుగుతున్నా.. దీనికి కారణమైన టెక్నాలజీకి ధన్యవాదాలు చెప్పాలి. అయినా సరే వారిని బాగా మిస్ అవుతున్న భావన కల్గుతోంది. ఇలాంటి సమయమే జీవితం విలువను చెబుతుంది. ప్రియమైన వారితో కలిసి గడిపిన రోజుల్ని గుర్తు చేస్తుంది. ఓ తండ్రిగా, భర్తగా నా పిల్లలు, భార్య జాగ్రత్త విషయంలో భయంగా, ఆందోళనగా ఉంది. వాళ్లు సురక్షితంగా ఉన్నారని తెలిసినా నా మనసు ఆగడం లేదు. నా కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడుతూ, పిల్లలతో చాట్ చేస్తూ సమయం గడుపుతున్నా. నా పిల్లలు ఆపకుండా మెసేజ్‌లు చేస్తూ సరదాగా ఉంటారు"
- సంజయ్ దత్, బాలీవుడ్ ప్రముఖ నటుడు
![Sanjay Dutt Misses His Family As They Are Stuck In Dubai, Compares Lockdown To His Jail Life](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6853221_rk.jpg)
ఇదీ చూడండి : కన్నడ హిట్ 'దియా' రీమేక్‌లో సమంత!