ETV Bharat / sitara

అధీర లుక్ వెనుక రహస్యం అదే! - కేజీఎఫ్ 2 వార్తలు

యశ్​ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం 'కేజీఎఫ్'. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రాబోతుంది. ఇందులో అధీర అనే క్రూర విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ పాత్ర లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో వైకింగ్ లుక్​తో ఆకట్టుకున్నారు సంజయ్. అందుకోసం సంజయ్ చాలా కష్టపడ్డట్లు తెలిపారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్.

అధీర లుక్ వెనుక రహస్యం అదే!
అధీర లుక్ వెనుక రహస్యం అదే!
author img

By

Published : Aug 4, 2020, 8:33 PM IST

Updated : Aug 4, 2020, 8:45 PM IST

ఇటీవల సంజయ్‌దత్‌ పుట్టినరోజు సందర్భంగా 'కేజీఎఫ్: చాప్టర్‌-2'లోని ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అప్పటివరకు 'కేజీఎఫ్‌-1'లోని గరుడను మించిన క్రూరుడిగా ఆ పాత్ర రూపం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, వైకింగ్‌ లుక్‌లో సంజయ్‌దత్‌ స్టిల్‌తో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఈ పాత్ర ఆహార్యంపై సంజయ్‌ దత్‌ ఎంతో శ్రద్ధ చూపారని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు.

"అధీర పాత్రను చూస్తే ఎవరైనా భయపడిపోవాలన్నట్లు ఉండాలని మేం అనుకున్నాం. అందుకే వైకింగ్‌ లుక్‌వైపు మొగ్గు చూపాం. ఇదే విషయాన్ని సంజయ్‌ సర్‌కు చెబితే, అందుకు తగినట్లు మారడానికి ఎంతో కష్టపడ్డారు. మాకు ఎంతో సాయం చేశారు. ఈ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపారు" అని ప్రశాంత్‌ నీల్‌ పేర్కొన్నారు.

తొలి భాగంగా అధీర పాత్రను అసలు చూపించలేదు. కేవలం సింహపు ఉంగరం ధరించిన వ్యక్తిని ముఖం కనపడనీయకుండా చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేస్తారన్న ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్‌-2 మొదలు పెట్టగానే సంజయ్‌ ఆ పాత్ర చేస్తారనే సరికి మరింత ఆసక్తి నెలకొంది. దీనిపై కూడా ప్రశాంత్‌ మాట్లాడారు. "కేజీఎఫ్‌-1 తీసే సమయంలో మాకు చాలా అడ్డంకులు, అవరోధాలు ఉన్నాయి. అయితే సినిమా విజయం సాధించిన తర్వాత రెండో భాగంపై మరింత దృష్టి పెట్టాం. ప్రేక్షకులు దీన్ని ఎంతో ఆసక్తితో గమనిస్తారని మాకు తెలుసు. ఇక ఇందులో ఎలాంటి సందేహం లేదు. చాప్టర్‌-2 అత్యుత్తమంగా ఉంటుంది" అని వివరించారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో యశ్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లు. ప్రధానిగా రవీనా ఠాండన్ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్‌ కనిపించనున్నారు.

Last Updated : Aug 4, 2020, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.