'అర్జున్‌రెడ్డి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తర్వాత ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు. అక్కడా ఘనవిజయం సాధించింది. ఆ చిత్ర నిర్మాతలు.. సందీప్‌తో మరో చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడట ఈ డైరెక్టర్. అందుకు కారణం డార్లింగ్ ప్రభాస్‌తో పనిచేసే అవకాశం రావడం.
ఇటీవలే ప్రభాస్‌ను కలిసి ఓ కథ వినిపించాడట దర్శకుడు సందీప్. స్టోరీలైన్ నచ్చటం, డార్లింగ్ హీరో పచ్చజెండా వెంట వెంటనే జరిగిపోయాయట. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయాలపై అధికారిక ప్రకటన రానుంది.
'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ప్రభాస్.. ఈ ఏడాది 'సాహో'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తెలుగులో మిశ్రమ స్పందన లభించినప్పటికీ, బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం అమితంగా నచ్చిందీ చిత్రం. ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రీకరణ పూర్తవగానే సందీప్ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:- స్వీటీ మరో సాహసం చేయబోతుందట..!