అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి దృష్టి తన వైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి అక్కడా బంపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు సందీప్ తర్వాతి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహేశ్ బాబుతో షుగర్ ఫ్యాక్టర్ అనే చిత్రం చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తాలొచ్చాయి. అయితే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు సందీప్.
‘షుగర్ ఫ్యాక్టరీ’ పేరుతో తాను కథ రాసుకున్న విషయం నిజమేనని, మహేష్‌తో చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు మాత్రం అవాస్తవమని ప్రకటించాడు. నిజానికి ఆ కథను ‘అర్జున్‌రెడ్డి’ కంటే ముందే రాసుకున్నాడట సందీప్. ఈ చిత్రాన్ని సాయికుమార్, రాజేంద్రప్రసాద్‌లలో ఎవరో ఒకరితో తెరకెక్కించాలని అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదట.
ఇదీ చదవండి: రెయిన్ డ్యాన్స్‌తో ఎంజాయ్ చేస్తున్న శ్రియ