ముంబయిలోని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో బెంగళూరు సీసీబీ సోదాలు చేసింది. కన్నడ చిత్రసీమ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న ఆదిత్య అల్వా.. వివేక్ ఒబెరాయ్‌కి స్వయానా బావమరిది. సెప్టెంబరు నుంచి అతడు పరారీలో ఉండగా.. అతడి సన్నిహితుల ఇళ్లలో సీసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
పోలీసులు కథనం ప్రకారం.. "ఆదిత్య అల్వా కన్నడ చిత్రసీమ డ్రగ్స్ కుంభకోణంలోని ప్రధాన నిందితుల్లో ఒకరు. బెంగళూరులోని అతడి నివాసంలో సెప్టెంబరులోనే సోదాలు చేశాం. మాదకద్రవ్యాల కేసు దర్యాప్తు జరుగుతున్నప్పటి నుంచి అతడు కనిపించడం లేదు. ఆదిత్యను పట్టుకునే క్రమంలో అతడి సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నాం" అని అధికారులు తెలిపారు.
వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సీసీబీ సోదాలు - కన్నడ సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ కేసు
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో బెంగళూరు సీసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కన్నడ చిత్రసీమ డ్రగ్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఆదిత్య అల్వా పరారీలో ఉండటం వల్ల.. అతని బంధువైన సదరు హీరో ఇంటిలో అధికారులు తనిఖీలు చేశారు .