ETV Bharat / sitara

పవన్​-రానా​ మల్టీస్టారర్​లో సముద్రఖని - పవన్​ రానా మల్టీస్టారర్​

మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్​ కోశియుమ్​' తెలుగు రీమేక్​లో పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, రానా దగ్గుబాటి కలిసి నటించనున్నారు. ఇందులో ఓ కీలకపాత్ర కోసం తమిళ నటుడు సముద్రఖనిని చిత్రబృందం సంప్రదించింది. ఈ విషయాన్ని సముద్రఖని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

samuthirakani in ayyappanum koshiyum telugu remake
పవన్​-రానా​ మల్టీస్టారర్​లో సముద్రఖని
author img

By

Published : Jan 15, 2021, 9:06 AM IST

అటు తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని. ఇటీవలే విడుదలైన 'క్రాక్​' చిత్రంలోనూ విలన్​ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. సముద్రఖని.. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయితే ఈ నటుడికి మరో మల్టీస్టారర్​ సినిమాలో అవకాశం లభించింది.

'అయ్యప్పనుమ్​ కోశియుమ్​' తెలుగు రీమేక్​లో తాను నటించబోతున్నట్లు సముద్రఖని ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. సాగర్​ కే చంద్ర దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​తో పాటు రానా దగ్గుబాటి ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఎస్​ నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ డైలాగులు రాస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఆ సినిమాలో నా పాత్రను చూసుకుని నేనే భయపడ్డా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.