ETV Bharat / sitara

మహేష్‌కి విలన్​గా ప్రముఖ దర్శకుడు - సర్కారు వారి పాట

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో విలన్ ఖరారయ్యారు. ప్రముఖ దర్శకుడిని చిత్ర బృందం ప్రతినాయక పాత్రకు ఎంపికచేసింది.

mahesh babu
మహేశ్​ బాబు
author img

By

Published : Jul 10, 2021, 8:31 AM IST

కథానాయకుడు మహేష్‌బాబు, దర్శకుడు పరుశురామ్‌ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్‌, 14రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. వచ్చే వారం నుంచి తిరిగి చిత్రీకరణ ప్రారంభించుకుంటోంది.

mahesh babu
'సర్కారు వారి పాట' పోస్టర్

ఈ నేపథ్యంలోనే ఇప్పుడిందులో ప్రధాన విలన్‌గా సముద్రఖనిని ఖరారు చేసింది చిత్ర బృందం. గతంలో ఈ పాత్ర కోసం అర్జున్‌, అరవింద్‌స్వామి, ఉపేంద్ర తదితరుల పేర్లు వినిపించాయి. దర్శక నిర్మాతలు సముద్రఖని వైపే మొగ్గు చూపారు. 'ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు ఆయన ఒక్కరే, మరో విలన్‌కి అవకాశం లేద'ని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నారు సముద్రఖని.

mahesh babu
సముద్ర ఖని

ఈ సినిమా కోసం తమన్‌ ఇప్పటికే మూడు పాటలు సిద్ధం చేశారు. చిత్రీకరణ పునఃప్రారంభం కాగానే మరో రెండు గీతాలు పూర్తి చేయనున్నట్లు ఆయన ఇటీవలే వెల్లడించారు. మహేష్‌ ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్‌ చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారు.

ఇదీ చూడండి: '3డీ' రామాయణంలో మహేశ్​ బాబు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.