ETV Bharat / sitara

Shakuntalam: 'సమంత' సినిమాకు మాత్రమే అనుమతి? - Gandipet lake movie shooting

స్టార్ హీరోయిన్ సమంత 'శాకుంతలం' షూటింగ్​ను ఓ ప్రదేశంలో జరిపేందుకు ప్రత్యేక అనుమతి లభించిందట. గత ఆరేళ్ల నుంచి చిత్రీకరణలు జరగని ఆ చోటులో ఈ సినిమాకు పర్మిషన్​ ఎలా వచ్చింది?

Samantha's Shakuntalam to be shot in Gandipet lake
సమంత
author img

By

Published : Jul 17, 2021, 11:34 AM IST

ముద్దుగుమ్మ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న పీరియాడికల్​ సినిమా 'శాకుంతలం'. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది.

'శాకుంతలం'కు మాత్రమే

పలు భద్రత కారణాల రీత్యా హైదరాబాద్​లోని గండిపేట లేక్​ దగ్గర షూటింగ్​లకు అనుమతి నిరాకరించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో గత ఆరేళ్ల నుంచి అక్కడ ఎలాంటి చిత్రీకరణలు జరగడం లేదు. అయితే 'శాకుంతలం' యూనిట్​కు మాత్రం అనుమతులు లభించాయని సమాచారం. త్వరలో ఆ లేక్ దగ్గర కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Samantha's Shakuntalam
దేవ్ మోహన్ - సమంత

'మహాభారతం' ఆధారంగా

మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళీ నటుడు దేవ్​ మోహన్​ కనిపించనున్నారు. మణిశర్మ సంగీతమందిస్తుండగా, గుణశేఖర్​ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమ గుణ నిర్మిస్తున్నారు.

బన్నీ వారసురాలు అరంగేట్రం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ.. 'శాకుంతలం'తోనే బాలనటిగా పరిచయమవుతోంది. ఇటీవల ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో ప్రిన్స్ భరత్​గా కనిపించనున్నట్లు వెల్లడించారు.

allu arha Samantha's Shakuntalam
అల్లు అర్హ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.