ETV Bharat / sitara

నాలో ప్రత్యేకత గుర్తించిన ఆ దర్శకుడికి థ్యాంక్యూ: సమంత - సమంత లేటేస్ట్ న్యూస్

సినిమాల్లో పదకొండేళ్ల కెరీర్​ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రముఖ నటి సమంత.. ఆసక్తికర వీడియోను ట్వీట్ చేసింది. దర్శకుడు గౌతమ్ మేనన్​తో పాటు భర్త నాగచైతన్య, నటి-నిర్మాత మంజులకు ధన్యవాదాలు తెలిపింది.

Samantha's heartfelt message to Gautham Vasudev Menon
నాలో ప్రత్యేకత గుర్తించిన ఆ దర్శకుడికి థ్యాంక్యూ: సమంత
author img

By

Published : Feb 26, 2021, 5:52 PM IST

Updated : Feb 26, 2021, 6:21 PM IST

'ఏ మాయ చేశావే' సినిమాతో ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచిన సమంత.. ఆ తర్వాత టాలీవుడ్ సహా దక్షిణాదిలో పలు భాషల్లో నటించి స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. శుక్రవారానికి(ఫిబ్రవరి 26) ఆ చిత్రానికి, తన కెరీర్​కు పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది సమంత. ఈ క్రమంలో దర్శకుడు గౌతమ్​ మేనన్​కు ధన్యవాదాలు తెలిపింది.

"'ఏమాయ చేశావే' 11వ వార్షికోత్సవం. నాలో నేను చూడని ప్రత్యేకతను గుర్తించిన గౌతమ్ మేనన్​కు థాంక్యూ. ప్రపంచంలోనే చాలా ఆనందమైన మహిళగా నన్ను చేసినందుకు నాగచైతన్య, మంజుల ఘట్టమనేనికి ధన్యవాదాలు" అని సమంత ట్విట్టర్​లో రాసుకొచ్చింది.

2017లో తన తొలి సినిమా హీరో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత.. అక్కినేని కోడలుగా మారింది. పెళ్లి తర్వాత కూడా మహానటి, ఓ బేబీ, యూటర్న్​ లాంటి కథా ప్రాధాన్యమున్న చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం గుణశేఖర్​ తీస్తున్న 'శాకుంతలం' చిత్రంలో టైటిల్​ రోల్ చేస్తోంది.

Samantha's heartfelt message to Gautham Vasudev Menon on special day!
ఏ మాయ చేశావే సినిమాలో సమంత నాగచైతన్య

Last Updated : Feb 26, 2021, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.