సినిమాలకు త్వరలో గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉంది అక్కినేని కోడలు సమంత. ఈ విషయాన్ని 'ఓ బేబీ' సక్సెస్ మీట్లో పరోక్షంగా ప్రకటించింది. సినిమా విజయం సాధించడంపై భావోద్వేగానికి గురైన సమంత.. సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుందంటూ దర్శకురాలు నందినిరెడ్డితో తన మనసులోని మాటను పంచుకున్నట్లు వెల్లడించింది.
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానా హాజరయ్యాడు. చిత్ర విజయంపై ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తనకు కొరియన్ సినిమా కథలు వినిపించాలని 'ఓ బేబీ' చిత్ర బృందానికి చెపుతూ చమత్కరించారు.
ఇది చదవండి: ఈ సినిమాతో ఆ కోరిక తీరిందన్న హీరోయిన్ సమంత