దక్షిణాది హీరోయిన్లు.. ఒకరిని మరొకరు ప్రశంసించుకోవడం కొత్తేమి కాదు. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది స్టార్ కథానాయిక సమంత. మిల్క్ బ్యూటీ తమన్నా.. 15 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన విషెస్ చెప్పింది. వెండితెర ఫైర్‌క్రాకర్ అని, ఆమెను స్క్రీన్‌పై చూసి మీరు చూపు తిప్పుకోలేరని తమన్నాపై పొగడ్తలు కురిపించింది.
"సినిమాల్లో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది తమన్నా. ఎప్పుడూ కష్టపడుతూ, నిజాయతీగా ఉండే వ్యక్తి. ఆమె వెండితెరపై ఫైర్‌క్రాకర్, ఆమెను చూసి మీరు చూపు తిప్పుకోలేరు. కంగ్రాచ్యులేషన్ డార్లింగ్" -సమంత, హీరోయిన్
2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే హిందీ సినిమాతో అరంగేట్రం చేసింది తమన్నా. ఆ తర్వాత దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అగ్రహీరోలందరితోనూ కలిసి నటించింది. ప్రస్తుతం గోపీచంద్‌తో 'సీటీమార్', హిందీలో 'బోల్ చుడియాన్'లో నటిస్తూ బిజీగా ఉంది.
సమంత.. ఇటీవలే 'జాను' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో పాటు, ఓ హారర్ చిత్రంలో నటిస్తోంది.