హీరో నాగార్జున గురువారం తన 60వ పుట్టిన రోజు వేడుకల్ని స్పెయిన్‌లోని ఐబిజాలో జరుపుకున్నాడు. అక్కడ జరిగిన బర్త్‌డే పార్టీలో సమంత ప్రత్యేకమైన దుస్తుల్లో మెరిసింది. పార్టీ కోసం ఆమె వన్-షోల్డర్ షిమ్మర్ పింక్ డ్రెస్, విలువైన కాస్ట్యూమ్స్ ధరించింది. ఆ లుక్‌లో ఉన్న ఫొటోలను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సామ్. వీటన్నింటి ధర రూ.2 లక్షలని సమాచారం.
సామ్ ఇటీవల 'ఓ బేబీ' సినిమాతో హిట్ అందుకుంది. కొరియన్ సినిమా 'మిస్‌గ్రానీ'కి తెలుగు రీమేక్‌గా.. దర్శకురాలు నందినిరెడ్డి దీన్ని తెరకెక్కించింది. ప్రస్తుతం ఆమె తమిళ హిట్ '96' సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఇందులో శర్వానంద్ కథానాయకుడు. దిల్‌రాజు నిర్మాత. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నచించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.
ఇదీ చూడండి...అందాల ఎర్ర నెమలి నిచ్చెనెక్కింది..!