ETV Bharat / sitara

పెళ్లి జరిగిన చోటే సమంత డ్రీమ్​హౌస్! - టాలీవుడ్​ వార్తలు

తమ పెళ్లి జరిగిన చోటే డ్రీమ్​హౌస్​ నిర్మించేందుకు సమంత-నాగచైతన్య సిద్ధమవుతున్నారు. స్థలం చూసేశారని, త్వరలో నిర్మాణం ప్రారంభిస్తారని సమాచారం.

నాగచైతన్య డ్రీమ్​హౌజ్
ఇష్టమైన హాలిడేస్పాట్​లో సమంత డ్రీమ్​హౌజ్!
author img

By

Published : Aug 18, 2021, 10:16 AM IST

Updated : Aug 18, 2021, 11:45 AM IST

నాగచైతన్య, సమంత.. టాలీవుడ్​లో ఈ జంటకు ఉండే క్రేజే వేరు. టాలీవుడ్​లో స్టార్​ కపుల్స్​గా గుర్తింపు పొందిన వీరు.. ఇప్పుడు హైదరాబాద్​ నుంచి గోవాకు మకాం మారుస్తున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట.. డ్రీమ్​హౌస్​ కట్టుకోవడం కోసం గోవాలో మంచి స్థలం చూసుకున్నారని, త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభిస్తారనే గుసగుసలు వినపడుతున్నాయి.

చైతూతో పెళ్లి తర్వాత సామాజిక మాధ్యమాల్లో తన పేరు చివరు అక్కినేని చేర్చిన సమంత.. ఇటీవల ఆ పేరును తొలగించి అభిమానులను అయోమయానికి గురిచేసింది. ఇందుకు కారణం ఏమై ఉంటుందా అని చర్చ జరుగుతున్న సమయంలో డ్రీమ్​హౌస్​ వార్త టాలీవుడ్​లో ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలి అంటే దీనిపై ఈ జంట స్పష్టత ఇచ్చే వరకూ ఆగాల్సిందే.

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన పాన్​ ఇండియా సినిమా 'శాకుంతలం' ఇటీవల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. 'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​తో బాలీవుడ్​ దృష్టినీ ఈమె ఆకర్షించింది. చైతన్య కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్​లో స్టార్ ఆమిర్​ఖాన్ 'లాల్​ సింగ్​ చద్దా'​లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చదవండి : ఎన్టీఆర్​ కోసం బాలీవుడ్​ నుంచే!

Last Updated : Aug 18, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.