వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్న నటి అక్కినేని సమంత. లాక్‌డౌన్ కారణంగా చిత్రసీమలోని అన్ని రకాల పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అయినా సరే సమంత మాత్రం తన వ్యాయామాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఆమె తన జిమ్ కోచ్‌తో వీడియో కాల్ ద్వారా కసరత్తులు చేస్తోంది.
ఇప్పటికే తన భర్త నాగచైతన్యతో కలిసి సరదాగా సందడి చేసిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది సామ్. మొత్తం మీద 'రంగస్థలం' చిత్రంలో రామలక్ష్మి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా అక్కడ పొలాల్లో కష్టపడ్డట్లు, ఇక్కడ ఇంట్లో కూడా శరీరాన్ని కష్టపెడుతోంది.
సమంత గతేడాది 'ఓ బేబీ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 'జాను' చిత్రంలో శర్వానంద్‌తో నటించింది. ప్రస్తుతం తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటిస్తోంది. అంతేకాదు వెబ్‌సీరీస్ 'ఫ్యామిలి మ్యాన్' సీజన్2లోను కీలకపాత్రలో కనిపించనుంది.