ETV Bharat / sitara

చైతూ, సమంత కొత్త వ్యాపారం .. వారి బాటలోనే! - సమంత తాజా వార్తలు

Samantha Latest News: నటిగా సూపర్ సక్సెస్​ అయిన సమంత తాజాగా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టారు. 'సస్టెయిన్ కార్ట్' అనే ఈ- కామర్స్ సంస్థలో సమంత పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే వ్యాపార రంగంలోకి వచ్చి మంచి లాభాలు ఆర్జిస్తున్న సెలబ్రిటీల జాబితాలో చేరారు.

actress samatha
కొత్త వ్యాపారంలోకి సమంత
author img

By

Published : Mar 8, 2022, 6:17 PM IST

Updated : Mar 16, 2022, 3:36 PM IST

Samantha Latest News: నటిగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ అయిన సమంత.. తాజాగా తన అదృష్టాన్ని పెట్టుబడుల రూపంలో పరీక్షించుకోనున్నారు. అవును 'సస్టెయిన్ కార్ట్' అనే ఈ- కామర్స్ సంస్థలో సమంత ఇన్​వెస్ట్ చేశారు. ఈ సంస్థను గతేడాది ప్రారంభించారు. ఇప్పటికే పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్న పలువురు సెలబ్రిటీల బాటలోనే సామ్ నడుస్తున్నారు.

samantha latest news
సస్టెయిన్ కార్ట్​ ఫ్లకార్డ్​తో సమంత
samantha latest news
సస్టెయిన్ కార్ట్​లో ఇన్​వెస్ట్ చేసిన సమంత

చైతూ రెస్టారెంట్ బిజినెస్​..

chaitanya akkineni: కొద్దిరోజుల క్రితం హీరో నాగచైతన్య కూడా ఓ రెస్టారెంట్ బిజినెస్​ను ప్రారంభించారు. 'షోయూ' పేరుతో పాన్ ఆసియా రుచులను ఇందులో అందిచనున్నారు. ఇటీవల సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య ప్రస్తుతం.. 'థాంక్యూ' సినిమా చేస్తున్నారు. త్వరలో ఓ వెబ్ సిరీస్​లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నారు.

బాలీవుడ్​లోనూ..

బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కత్రినా కైఫ్, ఆలియా భట్​.. గతేడాది నైకా అనే ఈ కామర్స్​ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఐపీఓకు ముందే నైకాలో పెట్టుబడులు పెట్టిన వీరిద్దరూ ఇప్పుడు 10 రెట్లకు పైగా లాభాలు గడించారు.

తన కాయ్​ బ్యూటీ ఉత్పత్తులను నైకాలో లాంచ్ చేసిన ఏడాది తర్వాత ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టింది కత్రినా. ఈ బ్రాండ్ విజయవంతంగా వృద్ధి చెందాక మరింత ఆసక్తితో వాటాలు కొనుగోలు చేసింది. 2018లో రూ.2.02కోట్లతో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టింది.

మరో బాలీవుడ్ యువనటి ఆలియా భట్​ నైకాపై కాస్త ఎక్కువ నమ్మకమే ఉంచింది. ఇందులో రూ.4.95కోట్లు పెట్టుబడి పెట్టింది. అయితే నైకా ఐపీఓ అత్యంత విజయవంతం కావడం వల్ల వీరిద్దరి వాటాల విలువ ఒక్క రోజులోనే 10 రెట్లుకు పైగా వృద్ధి చెందింది.

ఇదీ చూడండి: వాళ్లే నా జీవితాన్ని నాశనం చేశారు: పూనమ్ కౌర్

Last Updated : Mar 16, 2022, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.