అక్కినేని కోడలు సమంత సామాజిక మాధ్యమాల్లో ఓ మైలురాయిని చేరుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించిన నటిగా నిలిచారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఓ పోస్టు పెట్టారు సామ్. ఈ సందర్భంగా 10 ఎన్జీవోలకు అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్‌మన్ కూడా ఇలానే చేశారని.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా అదే పని చేస్తున్నట్లు సమంత వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డేలకు 10 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు సామ్. ఇందులో నయనతార కూడా నటిస్తున్నారు. నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలతో పాటు వెబ్సిరీస్లపైనా దృష్టిసారించారు సమంత. ఆమె నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 త్వరలోనే విడుదల కానుంది.