టాలీవుడ్ నటి సమంత(samantha new movies) ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నాగచైతన్యతో విడాకులు అయినప్పటి నుంచి వరుసగా పర్యటనలు, యాత్రలకు వెళుతోంది. ఇప్పటికే ఆమె నటించిన 'శాకుంతలం' షూటింగ్ పూర్తిచేసుకోగా.. మరికొన్ని ప్రాజెక్టులు లైనప్లో ఉన్నాయి. వాటితో పాటు కొత్త సినిమాలకూ ఓకే చెబుతోంది. తాజాగా సినీ వర్గాల చెబుతున్న దాని ప్రకారం సామ్.. ఒక్కసారిగా భారీగా పారితోషికం(samantha remuneration per movie) పెంచిందట. ఓ సినిమాకు ఏకంగా రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
'శాకుంతలం'తో పాటు సమంత(samantha new movies) నటించిన 'కాతువాకుల రెండు కాదల్' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు, 'డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్', శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో రెండు సినిమాల చేసేందుకు ఒప్పుకొంది సామ్. మరికొన్ని పాన్ ఇండియా మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.