ETV Bharat / sitara

ఆ ఉద్దేశంతో రాజీ పాత్ర చేయలేదు: సమంత

author img

By

Published : Aug 25, 2021, 10:10 PM IST

Updated : Aug 25, 2021, 10:46 PM IST

'ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​తో తానేంటో మరోసారి నిరూపించుకుంది నటి సమంత. ఈ సిరీస్​లోని రాజీ పాత్రకుగానూ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (Indian film festival of melbourne)లో ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన సామ్ పలు విషయాలు వెల్లడించింది.

సమంత
సమంత

'జెస్సీ', 'ఇందు', 'బిందు', 'గీత', 'శశి', 'అంజలి', 'సమీర', 'రామలక్ష్మి', 'మధురవాణి', 'శ్రావణి' తదితర వైవిధ్య పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది నటి సమంత (Samantha). ఆ వైవిధ్యాన్ని వెండితెరపైనే కాకుండా డిజిటల్‌ మాధ్యమాల్లోనూ చూపించాలనుకుంది. అలా చేసిన ప్రయత్నం, ప్రయోగమే 'ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2' (The family man 2) వెబ్‌ సిరీస్‌. ఇందులో 'రాజీ' పాత్రను పోషించి, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. డీ గ్లామర్‌గా కనిపించి 'తను సమంతనేనా?' అనే ఆశ్చర్యంలో పడేసింది. ఉత్తమ నటిగా ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (Indian film festival of melbourne) అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా సమంత ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో ముచ్చటించింది. ఆ వివరాలివీ..

samantha
డీగ్లామర్ రోల్​లో సమంత

ఉత్తమ నటిగా ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌- 2021 అవార్డు గెలుచుకున్నారు. ఎలా ఫీల్‌ అవుతున్నారు?

సమంత: చాలా చాలా ఆనందంగా ఉంది. 'ఫ్యామిలీ మ్యాన్‌ 2'.. నేను నటించిన తొలి వెబ్‌ సిరీస్‌. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ నటిగా అవార్డు పొందడం నాలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈ సిరీస్‌ ఇప్పటికే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ అవార్డు ప్రకటనతో మరింత ప్రోత్సాహం అందినట్టే.

'ఫ్యామిలీమ్యాన్‌ 2' వెబ్‌సిరీస్‌లో రాజీగా అత్యుత్తమంగా నటించారు. కానీ మీ పాత్ర, సిరీస్‌లపై విమర్శలు వచ్చాయి కదా..!

సమంత: అవును. సిరీస్‌ విడుదలకి ముందు కొన్ని విమర్శలు ఎదురైనా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆ ట్రోలింగ్‌ ఆగిపోయింది. అయితే రాజీ పాత్ర పోషించినందుకు ఇప్పటికీ నాపై ఆగ్రహం వ్యక్తం చేసేవారున్నారు. ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ పాత్రలో నటించలేదు. నాకు బాగా నచ్చడం వల్ల నిజాయతీగా రాజీ పాత్రని పోషించా. అయినా ఆ పాత్ర కొందరిని బాధించింది కాబట్టి ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా.

సామాజిక మాధ్యమాల ఖాతాల్లో అక్కినేని సమంత పేరుని తొలగించి 'ఎస్‌' అని పెట్టారు. అది హాట్‌ టాపిక్‌ అయింది. దీనిపై మీ స్పందన?

సమంత: అది హాస్యాస్పదమైన గాసిప్‌. సాధారణంగా నేను గాసిప్స్‌కి స్పందించను. ఇప్పుడూ అంతే.

samantha
ఫ్యామిలీ మ్యాన్​ 2లో సమంత

'శాకుంతలం'లో నటించడం ఎలా అనిపించింది?

సమంత: పీరియాడికల్‌ చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో కోరిక. అది 'శాకుంతలం'తో నెరవేరింది. ఈ సినిమాకు పని చేయడం గొప్ప అనుభూతిని పంచింది. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. సీజీ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌), వి.ఎఫ్‌.ఎక్స్‌ (విజువల్‌ ఎఫెక్ట్స్‌)లతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి ఎదురుచూస్తున్నా.

'కాతువాకుల రెండు కాదల్‌' చిత్రం కోసం నయనతార, విజయ్‌ సేతుపతితో నటించడం ఎలా ఉంది?

సమంత: నేనెప్పుడూ కామెడీ పాత్రని పోషించడాన్ని ఆనందిస్తా. ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడం వల్ల బాగా ఎంజాయ్‌ చేస్తూ నటించా. ఇందులో భాగమవడం, ఇద్దరు సూపర్‌స్టార్లు నయనతార, విజయ్‌ సేతుపతితో కలిసి పనిచేయడం మంచి థ్రిల్‌ పంచింది. ఇది తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా. అందరినీ నవ్విస్తుందనే నమ్మకం నాకు ఉంది.

samantha
ఫ్యామిలీ మ్యాన్​ 2 షూటింగ్ సందర్భంగా

ఇటీవల మీరు చూసిన వెబ్‌ సిరీస్‌ ఏంటి?

సమంత: 'మారే ఆఫ్‌ ఈస్ట్‌టౌన్‌'ని చూశా. చాలా బాగుంది. కేట్‌ విన్ల్సెట్‌ నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల నేను ఎంజాయ్‌ చేసిన గొప్ప వెబ్‌ సిరీస్‌ ఇది.

మీ తదుపరి చిత్రాలు?

సమంత: ఇప్పటి వరకు ప్రకటించిన చిత్రాలే తప్ప కొత్త కథల్ని వినలేదు. కొన్ని రోజులు విరామం తీసుకుని, ఆ తర్వాత స్క్రిప్టుల్ని వినాలనుకుంటున్నా. (ప్రస్తుతం.. గుణ శేఖర్‌ దర్శకత్వంలో 'శాకుంతలం', విఘ్నేశ్‌ దర్శకత్వంలో 'కాతువాకుల రెండు కాదల్‌' సినిమాలు చేస్తున్నారామె).

ఇవీ చదవండి:

Last Updated : Aug 25, 2021, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.