Samantha news: ఎన్నో సినిమాలో హీరోయిన్గా చేసిన సమంత.. వాటికి భిన్నంగా తొలిసారి 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో ప్రతినాయక లక్షణాలున్న పాత్ర చేసింది. రాజీగా ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది. మరి ప్రేక్షకుల మెచ్చుకున్న తర్వాత అవార్డులు వరించకుండా ఉంటాయా? అలా వచ్చిందే ఇది.
Filmfare OTT awards: గురువారం ముంబయిలో ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో భాగంగానే 'ఫ్యామిలీ మ్యాన్ 2' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా సమంత అవార్డు గెలుచుకుంది.
ఈమెనే కాకుండా ఈ సిరీస్‌కు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ఒరిజినల్ స్టోరీ, బెస్ట్ డైరెక్టర్స్, బెస్ట్ యాక్టర్(మేల్) విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.
ఎన్నో వివాదాల నడుమ ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ప్రఖ్యాత ఐఎమ్‌డీబీ టీవీ సిరీస్ ర్యాంకింగ్స్‌లో ఈ సిరీస్‌కు నాలుగో స్థానం దక్కింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2'ను దర్శకద్వయం రాజ్, డీకే తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో తమిళ ఈలం సోల్జర్ రాజీగా సమంత నటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- ఆ ఉద్దేశంతో రాజీ పాత్ర చేయలేదు: సమంత
- సమంత 'ఫ్యామిలీ మ్యాన్ 2' హవా.. 10 విభాగాల్లో నామినేట్
- Samantha bollywood offer: బాలీవుడ్ ఎంట్రీపై సమంత క్లారిటీ
- 'యశోద'గా సమంత.. ఈసారి అలాంటి కథతో సాహసం
- 'సమంతతో రొమాంటిక్ సీన్స్ కట్.. కారణం అదే'
- 'ఫ్రెండ్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెనక్కినెట్టిన 'ఫ్యామిలీ మ్యాన్ 2'
- The Family Man: ఆయన వల్లే 'ఫ్యామిలీ మ్యాన్' చేశా: ప్రియమణి
- The Family Man 2: సమంత రెమ్యునరేషన్ అన్ని కోట్లా?