ETV Bharat / sitara

ప్రియాంక చోప్రా మాటలకు సమంత ఫిదా - సమంత హజ్బెండ్

Samantha news: స్టార్ ప్రియాంక చోప్రా పోస్ట్ చేసిన వీడియోకు ఫిదా అయింది ముద్దుగుమ్మ సమంత. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

Priyanka Chopra Samantha
ప్రియాంక చోప్రా సమంత
author img

By

Published : Jan 6, 2022, 2:17 PM IST

Samantha naga chaitanya: నాగచైతన్యతో వైవాహిక బంధానికి ముగింపు పలికిన తర్వాత కథానాయిక సమంత(Samantha) వరుస సినిమాలతో బిజీగా మారింది. సామాజిక మాధ్యమాల్లోనూ స్ఫూర్తిమంతమైన వీడియోలు పోస్ట్ చేస్తుంది. ముఖ్యంగా మానసిక స్థైర్యం, ఆర్థిక స్వాతంత్ర్యం వంటి విషయాలను షేర్‌ చేస్తుంది.

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా పంచుకున్న వీడియోపై తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సామ్. తనకెంతో నచ్చిందంటూ హార్ట్‌ సింబల్‌తో షేర్‌చేసింది.

"నా చిన్నప్పటి నుంచి మా నాన్న, నాకు తొమిదేళ్ల వయసు నుంచి మా అమ్మ అనేక విషయాలు నేర్పేవారు. 'ఏదైనా చేయాలనుకుంటే అంతకన్నా ముందు నువ్వు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించాలి. నువ్వు ఎవరి కూతురువి, ఎవరిని పెళ్లి చేసుకున్నావన్నది ముఖ్యం కాదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి' అని చెప్పేవారు. అప్పటి నుంచి ఆ విషయాన్ని మర్చిపోలేదు. 12ఏళ్ల వయసు నుంచీ దాన్ని ఆచరించటం మొదలు పెట్టా. ఏటా నేను ఏయే స్థానాలకు వెళ్లాలనుకున్నానో నిర్ణయించుకుంటూ, నా లక్ష్యాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నా" అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ఆర్థిక స్వాతంత్ర్యం గురించి ప్రియాంక చెప్పిన మాటలకు సమంత ఫిదా అయింది.

నాగచైతన్యతో విడిపోయేందుకు సమంత రూ.200 కోట్ల భరణం అడిగినట్లు వచ్చిన వార్తలను సమంత ఖండించింది. చైతూ నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.