సమంత భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ ఏప్రిల్ 5న విడుదల కానుంది. తమిళంలో నటించిన ‘సూపర్ డీలెక్స్’ మార్చి 29న విడుదలకు సిద్ధమయింది. ఈ సందర్భంగా సమంత అభిమానులతో ట్విట్టర్లో కాసేపు ముచ్చటించింది.
కథలు రిపీట్ చేయకుండా విభిన్నమైన స్క్రిప్టుల్ని ఎంచుకునేందుకు మీరు ఏం చేస్తారు?
- సమంత: ‘మజిలీ’ రొమాంటిక్, ఫ్యామిలీ కథ. ‘సూపర్ డీలెక్స్’ థ్రిల్లర్ సినిమా. అలాంటి విభిన్నమైన కథలు రావాలని కోరుకుంటానంతే.
మీ బెస్ట్ క్రిటిక్ ఎవరు?
- సమంత: నేనే.
మిమ్మల్ని దృఢంగా ఉంచి, ముందుకు నడిపించే విషయం ఏంటి?
- సమంత: నేర్చుకోవడాన్ని ఆపేస్తానేమో అనే భయం ముందుకు నడిపిస్తుంది.
అందంగా ఉన్నాననే నమ్మకమే ఓ మహిళను మరింత అందంగా చేస్తుందా?
- సమంత: అది కచ్చితంగా నిజం.
‘ఓ బేబీ’ చిత్రం కొత్తదనంతో ఆసక్తికరంగా ఉంటుందని ఆశించవచ్చా ?
- సమంత: అలానే ఉంటుంది ప్రామిస్ చేస్తున్నా.
‘మజిలీ’ సినిమా విజయంపై మీ నమ్మకం ఎంత?
- సమంత: నేను చేసిన ప్రతి సన్నివేశంపై నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా మీ హృదయాల్ని తాకుతుంది.
చైతన్యతో కలిసి మీరు చేసిన పాత్రల్లో బాగా ఇష్టమైనది ఏది?
- సమంత: జెస్సీ (ఏమాయ చేసావె సినిమాలోని పాత్ర).. ఎందుకంటే అదే మమ్మల్ని ఒక్కటి చేసింది.
ఫ్యాషన్‌పరంగా మీకు స్ఫూర్తిదాయకం ఎవరు?
- సమంత: ఆడ్రీ హెప్‌బర్న్ (బ్రిటిష్ నటి, మోడల్, డ్యాన్సర్).
చిన్నతనంలో మీరు బాగా చూసి, ఇప్పుడు మిస్ అవుతున్న షో?
- సమంత: ఐ లవ్ లూసీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కుటుంబంతో కలిసి ‘మజిలీ’ సినిమా చూసేందుకు ఓ గట్టి కారణం చెప్పండి?
- సమంత: ప్రతి సన్నివేశం వాస్తవికంగా ఉంటుంది. కచ్చితంగా ప్రతి ఒక్కరు సినిమాలోని ఏదో ఒక సన్నివేశానికి కనెక్ట్ అవుతారని నేను పందెం కట్టగలను.
మీరు చేసిన ఇన్ని సినిమాల్లో సవాలుగా అనిపించిన పాత్ర ఏది?
- సమంత: ‘ఓ బేబీ’లోని పాత్ర. ఎందుకంటే కామెడీ పండించడం చాలా కష్టం.
మీకు స్ఫూర్తిగా నిలిచిన హాలీవుడ్ నటి ఎవరు?
- సమంత: ఆడ్రీ హెప్‌బర్న్, జెన్నీఫర్ లారెన్స్, ఎమ్మా స్టోన్.
మీలాగా మారాలి అనుకునే వారికి ఏం సలహా ఇస్తారు?
- సమంత: బాగా కష్టపడటానికి సిద్ధం అవ్వండి.