బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్..ప్రస్తుతం 'దబాంగ్-3' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దర్శకుడు ప్రభుదేవా.. ఇదే కథానాయకుడితో మరో చిత్రం తీసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని సల్మాన్ ధ్రువీకరించాడు. వచ్చే ఏడాది ఈద్‌కు మరో చిత్రంతో రాబోతున్నట్లు ప్రకటించాడు.
"మేం (ప్రభుదేవా-నేను) మరో సినిమా చేస్తున్నాం. వచ్చే ఏడాది 'ఈద్'కు రాబోతున్నాం. అయితే ఈ చిత్రం పేరు 'రాధే' కాదు". -సల్మాన్‌ఖాన్, కథానాయకుడు.
ఇంతకు ముందు 'ఇన్షాల్లా' సినిమాను వచ్చే ఏడాది 'ఈద్'కు తెస్తున్నట్లు చెప్పాడు సల్మాన్‌ఖాన్. కానీ సాంకేతిక కారణాల వల్ల అనుకున్న సమయానికి రాలేకపోతున్నామని ఇటీవలే వెల్లడించాడు.
ప్రభుదేవా తెరకెక్కించే సినిమా కొరియన్ చిత్రం 'వెటరన్'కు రీమేక్‌గా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇది చదవండి: కాస్త వినూత్నంగా అమితాబ్ బచ్చన్‌కు శుభాకాంక్షలు