'దబంగ్' పేరు వినగానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ శౌర్యం, యాక్షన్ గుర్తొస్తాయి. మంచివాళ్లకు మంచివాడుగా, విలన్లను చిత్తుచేసే హీరోగా.. సల్మాన్ నటన ఆకట్టుకుంటుంది. మూడు సీక్వెల్స్‌గా తెరకెక్కినా.. సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను యానిమేటెడ్ వెబసిరీస్గా రూపొందించనున్నారు ఆ సినిమా నిర్మాత అర్బాజ్‌ఖాన్. రెండు సీజన్లుగా దీన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రముఖ యానిమేషన్ స్టూడియోస్ 'కాస్మోస్ మాయా' ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించనుంది. మొదటి సీజన్లో అరగంట చొప్పున 52 ఎపిసోడ్లు ఉంటాయని అన్నారు అర్బాజ్. ఇందుకోసం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఈ సిరీస్‌లో సల్మాన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చుల్బుల్ పాండేను.. మరింత పవర్‌ఫుల్‌గా చూపించనున్నట్లు తెలిపారు. ఇందులో సోనాక్షి సిన్హా, వినోద్ ఖన్నా, సోనూసూద్, ప్రకాశ్‌రాజ్, కిచ్చా సుదీప్ కనువిందు చేయనున్నారు.
ఇదీ చూడండి : వలస కూలీల కోసం టోల్ ఫ్రీ నెంబర్ : సోనూసూద్