బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్.. మరోసారి తనలోని గాయకుడిని బయటకు తీశారు. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి 'తేరా బినా' అంటూ పాడారు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నారు.
'లాక్డౌన్ కాన్వర్జేషన్స్' పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సల్మాన్ మాట్లాడుతూ.. "ఇది కేవలం నాకోసమే పాడుకున్నాను దీనిని చిత్రీకరించడానికి నాలుగు రోజులు పట్టింది. ఈ పాటను ఏ సినిమాలోనూ పెట్టాలనుకోవట్లేదు" అని చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
లాక్డౌన్ విధించినప్పటి నుంచి ముంబయికి కొంచెం దూరంలో ఉన్న తన ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు సల్మాన్. ఇతడితో పాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, టీవీ వ్యాఖ్యాత లూలియ వంతూర్ తదితరులు అక్కడే ఉన్నారు. ఆ ప్రాంతానికి దగ్గరలోని గ్రామ ప్రజలకు, ఈ మధ్యే నిత్యావసర సామాగ్రిని అందజేశారు ఈ కథానాయకుడు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'రాధే'లో సల్మాన్ నటిస్తున్నాడు.