ETV Bharat / sitara

Salman khan: 'మాస్టర్​'తో పాటు రవితేజ సినిమా రీమేక్​లోనూ! - Salman Khan news

దక్షిణాది చిత్రాల హిందీ రీమేక్స్్​లో ఇప్పటికే నటించిన సల్మాన్​ఖాన్.. మరో రెండు సినిమాలను బాలీవుడ్​ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ విషయంపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది.

Salman Khan Master remake
సల్మాన్​ఖాన్
author img

By

Published : Jun 12, 2021, 6:54 AM IST

సల్మాన్​ఖాన్ ఓ తమిళ చిత్రం హిందీ రీమేక్​లో నటింబోతున్నాడు అని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. విజయ్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం 'మాస్టర్'. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకారణ పొందింది. ఈ చిత్రాన్ని ఎండెమోల్ షైన్ ఇండియా, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, నిర్మాత మురాద్ భేతానీ కలిసి హిందీలో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటింబోతున్నట్లు సమాచారం. సల్మాన్ 'మాస్టర్' చిత్రాన్ని చూసి, రీమేక్​లో నటించడానికి అంగీకారం కూడా తెలిపారట.

Salman Khan
సల్మాన్​ఖాన్

లాక్​డౌన్ కారణంగా ఈ సినిమా వ్యవహారాలు కొన్ని రోజులుగా ఆగిపోయాయి. ఇప్పుడు ఈ కొత్త చిత్రానికి సంబంధించిన సన్నాహాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది? దర్శకుడు ఎవరు? లాంటి విషయాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 'రాధే' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సల్మాన్ ప్రస్తుతం 'అంతిమ్', 'టైగర్ 3', 'కబీ ఈద్ కబీ దివాలీ', 'కిక్ 2' చిత్రాల్లో నటిస్తున్నాడు. జులైలో 'మాస్టర్' రీమేక్ తో పాటు మరో భారీ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రవితేజ 'ఖిలాడీ' హక్కులు: రవితేజ కథానాయకుడిగా రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఖిలాడీ'. ఈ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. 'క్రాక్' విజయం తర్వాత రవితేజ నుంచి రానున్న చిత్రమిది. ఈ సినిమా హిందీ హక్కులను సల్మాన్ ఖాన్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.