ETV Bharat / sitara

'రాధే' రిలీజ్​ మీ మీదే ఆధారపడింది: సల్మాన్​ - radhe movie release postpone

'రాధే' సినిమా అనుకున్న తేదీకే విడుదల చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్​. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే ఈ చిత్రం విడుదల చేయడం కష్టమేనని అన్నారు.

salman
సల్మాన్​ రాధే
author img

By

Published : Apr 8, 2021, 9:01 PM IST

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, మహారాష్ట్రలో వారంతపు లాక్​డౌన్​ విధించడం వల్ల వరుసగా బాలీవుడ్​ బడా హీరోల సినిమా విడుదల తేదీలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే అక్షయ్​కుమార్​ 'సూర్యవంశీ', అమితాబ్​ బచ్చన్​ 'చెహ్రే' సినిమాలు వాయిదా పడగా.. ఇప్పుడు సల్మాన్​ ఖాన్​ నటించిన 'రాధే'ను పోస్ట్​పోన్​ చేసే యోచనలో చిత్రబృందం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలో దీనిపై స్పందించిన సల్మాన్​ ఈ విధంగా మాట్లాడారు. "చెప్పిన సమయానికే సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ, లాక్​డౌన్​ ఇలానే కొనసాగితే వచ్చే ఈద్​కు చిత్రాన్ని వాయిదా వేస్తాం. ప్రజలందరూ మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం, కరోనా నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తే అనుకున్న తేదీకే సినిమా రిలీజ్​ చేస్తాం. సెకండ్​ వేవ్​ త్వరగా ముగిసిపోతుందని అనుకుంటున్నాను. నిబంధనలు ఉల్లంఘిస్తే కరోనా కేసులు మరింత పెరిగిపోతాయి, దానివల్ల థియేటర్​ యజమానులే కాకుండా వలస కూలీల ఉపాధికీ ముప్పు ఏర్పడుతుంది" అని అన్నారు.

ఇదీ చూడండి: సల్మాన్​ vs జాన్ అబ్రహం.. 'విరాటపర్వం' టీజర్​ కౌంట్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.