కొత్త సాగు చట్టాలపై దిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ అంశంపై ఇటు జాతీయ సెలబ్రిటీలతో పాటు అంతర్జాతీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. కొందరు ఆందోళనను తప్పుబడుతుంటే మరికొందరు మద్దతిస్తున్నారు. తాజాగా ఈ విషయమై స్పందించాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.
"ఏది సరైనదో ఆ పని చేయాలి. అందరికీ ఉపయోగపడే తెలివైన నిర్ణయం తీసుకోవాలి" అని సల్మాన్ తెలిపాడు. ఇంతకుముందు సోషల్ మీడియాలో కానీ, బయట కానీ సల్మాన్ ఈ విషయంపై స్పందించలేదు.