ETV Bharat / sitara

ఆ రాష్ట్రంలో సల్మాన్​, ఆలియా, కరణ్​ సినిమాలు బ్యాన్​!

హీరో​ సుశాంత్​ మృతికి బాలీవుడ్​లోని నెపోటిజమే కారణమంటూ.. సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బిహార్​లో ఇకపై సల్మాన్​, ఆలియా భట్​, కరణ్​ జోహార్​ చిత్రాలను నిషేధించాలని సుశాంత్​ అభిమానులు డిమాండ్​ చేస్తున్నారు.

Salman Khan, Karan Johar, Alia Bhatt's films to be banned in Bihar?
బిహార్​లో సల్మాన్​, ఆలియా, కరణ్​ సినిమాలు బ్యాన్​!
author img

By

Published : Jun 24, 2020, 10:47 PM IST

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణంతో ఇండస్ట్రీలోని బంధుప్రీతి అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కారణంగానే బీటౌన్‌లోని చాలామంది అగ్రనటీనటులు సుశాంత్‌ను చులకనగా చూశారని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా సుశాంత్‌ సొంత రాష్ట్రమైన బిహార్‌లో ఇకపై సల్మాన్‌, ఆలియా భట్‌, కరణ్‌ జోహార్‌ చిత్రాలను నిషేధించాలని సుశాంత్​ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు భవిష్యత్తులో ఆ ఇద్దరు నటీనటుల చిత్రాలతోపాటు నిర్మాత కరణ్‌ జోహార్‌ సినిమాలను కూడా బిహార్‌లో ప్రదర్శించనివ్వమని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

సుశాంత్‌పై సినిమా..

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని త్వరలో తాను ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్​ సనోజ్‌ మిశ్రా ప్రకటించారు. అయితే, ఇది సుశాంత్‌ సింగ్‌ బయోపిక్‌ కాదని.. తమ కలలను సాకారం చేసుకోవాలని కొంతమంది పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ సినిమాలో చూపించనున్నామని తెలిపారు. అయితే ఈ సినిమాకి 'సుశాంత్‌' అనే టైటిల్‌ పెట్టనున్నట్లు వివరించారు. "బాలీవుడ్‌లోని వేధింపుల కారణంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని ముగిస్తున్న వారందరి అవస్థలను ఈ సినిమాలో చూపించనున్నాను. రోడ్‌ ప్రొడెక్షన్‌, సనోజ్‌ మిశ్రా ఫిల్మ్స్‌ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ముంబయి, బిహార్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నాం" అని సనోజ్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.