ETV Bharat / sitara

చిరు సినిమాలో నటిస్తున్నా: సల్మాన్ క్లారిటీ - గాడ్​ఫాదర్​ సినిమాలో సల్మాన్​ఖాన్​

salman khan in godfather: మెగాస్టార్ 'గాడ్​ఫాదర్' చిత్రంలో నటిస్తున్నానని కండలవీరుడు సల్మాన్​ ఖాన్​ స్పష్టం చేశారు. ఈ మేరకు హైదారాబాద్​లో జరిగిన 'అంతిమ్' సినిమా థ్యాంక్స్ మీట్​లో మాట్లాడారు.

salman khan in godfather
గాడ్​ఫాదర్
author img

By

Published : Dec 1, 2021, 9:00 PM IST

godfather telugu movie 2020: మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ నటించే అవకాశాలున్నాయంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. దీనిపై స్వయంగా సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ 'గాడ్​ఫాదర్' చిత్రంలో నటిస్తున్నానని కండలవీరుడు స్పష్టం చేశారు. ఈ మేరకు హైదారాబాద్​లో జరిగిన 'అంతిమ్' సినిమా థ్యాంక్స్ మీట్​లో మాట్లాడారు. 'తన సినిమాలో నటించాలని చిరంజీవి కోరారు. అందుకు నేను ఓకే చెప్పాను.' అని సల్మాన్​ అన్నారు.

హైదరాబాద్​ బిర్యానీ అంటే చాలా ఇష్టం:

సల్మాన్‌ ఖాన్‌ ఫిలిమ్స్ బ్యానర్‌పై నటిస్తూ నిర్మించిన చిత్రం 'అంతిమ్‌'. ఆయుశ్‌ శర్మ ముఖ్య పాత్రధారి. మహేశ్‌ ముంజ్రేకర్‌ దర్శకత్వం వహించారు. నవంబర్‌ 26న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. సల్మాన్‌ ఖాన్‌, ఆయుష్‌ శర్మ, డైరెక్టర్‌ మహేశ్‌ మంజ్రేకర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. "హైదరాబాద్‌ నాకు ఇష్టమైన ప్రదేశం. ఇక్కడికి రాగానే బిరియానీ రుచి చూశా. 'అంతిమ్‌' అందరినీ మెప్పిస్తోంది. మళ్లీ వచ్చినప్పుడు కచ్చితంగా అభిమానులను కలుస్తా" అని సల్మాన్‌ చెప్పారు.

ఇదీ చదవండి:బ్రహ్మానందంపై బాలయ్య సీరియస్.. ఎందుకంటే?

'లక్ష్య' ట్రైలర్.. 'పుష్పక విమానం' ఓటీటీ రిలీజ్ డేట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.