కరోనాతో తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థికి సహాయం చేసేందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ ముందుకొచ్చాడు. కర్ణాటకకు చెందిన ఓ సైన్స్ విద్యార్థికి సహాయం కావాలని గుర్తించిన సల్మాన్.. అతని అనుచరుడైన రాహుల్ ఎస్ కర్నల్‌ను విద్యార్థి వద్దకు పంపాడు. ఆ విద్యార్థికి కావాల్సిన అవసరాలను సమకూర్చమని సల్మాన్ తమకు ఆదేశించినట్లు రాహుల్ వెల్లడించాడు.
"మేము ఆ విద్యార్థికి రేషన్, చదువుకోవడానికి కావాల్సినవి అందించాం. భవిష్యత్‌లో అతడికి అవసరాలకు సహయాన్ని అందిస్తాం. మేమంతా సల్మాన్ అభిమానులం. ఇతరులకు సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం. సల్మాన్ కూడా మాకు అదే చెప్పారు. అవసరమైన వారికి ఆసరాగా ఉండమని! మేము చేసే ప్రతి పని ఆయనకు కచ్చితంగా తెలుస్తుంది."
- రాహుల్ ఎస్ కర్నల్, బీయింగ్ హంగ్రీ వ్యాన్స్ నిర్వాహకుడు
కరోనాపై పోరాటం చేస్తోన్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఆహారాన్ని అందించేందుకు హీరో సల్మాన్‌ఖాన్ ఇదివరకే ఓ కార్యక్రమాన్ని చేపట్టాడు. ముంబయిలోని కార్మికులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న కనీసం 5 వేల మందికి ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బీయింగ్ హంగ్రీ వ్యాన్స్ ద్వారా వారందరికీ సల్మాన్ అనుచరుడు రాహుల్ ఎస్ కర్నల్ ఆహారాన్ని పంచిపెడుతున్నాడు.
ఇదీ చూడండి: 'ఫ్యామిలీ మ్యాన్ 2' రిలీజ్‌కు ముహూర్తం ఖరారు?