ETV Bharat / sitara

కృష్ణజింక కేసు: వాదనలకు మరోసారి సల్మాన్ గైర్హాజరు

author img

By

Published : Dec 1, 2020, 5:12 PM IST

Updated : Dec 1, 2020, 10:24 PM IST

జోధ్​పూర్​లో కృష్ణజింకలను వేటాడిన కేసులో భాగంగా కోర్టు వాదనలకు బాలీవుడ్​ హీరో సల్మాన్​ ఖాన్​ మరోసారి గైర్హాజరయ్యాడు. కరోనా వ్యాప్తి కారణంగా జోధ్​పూర్​లోని జిల్లా, సెషన్స్​ కోర్టులో జరుగుతున్న వాదనలకు రావడం లేదని కోర్టుకు విన్నవించుకున్నాడు.

Blackbuck case: Salman Khan skips hearing owing to surge in COVID-19 cases
కృష్ణజింకల కేసు: వాదనలకు మరోసారి సల్మాన్​ గైర్హాజరు

కృష్ణజింకల వేట కేసులో భాగంగా జోధ్​పూర్​ జిల్లా, సెషన్స్​ కోర్టు ముందు హాజరు కావాల్సిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి గైర్హాజరయ్యాడు. ఇప్పటివరకు ఈ కేసు వాదనలు జరిగిన 15 సార్లు ఏదో ఒక కారణం చెబుతూ రెండున్నరేళ్లుగా కేసు వాదనలకు హాజరు కాలేదు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి కారణంగా కోర్టు ఎదుట హాజరు కాలేకపోతున్నానని తెలిపాడు సల్మాన్. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 16కు కోర్టు వాయిదా వేసింది.

కరోనా పుణ్యమా అంటూ..

ఈ ఏడాదిలో ఏప్రిల్​ 18, జూన్​ 4, జులై 16, సెప్టెంబరు 14, సెప్టెంబరు 28, డిసెంబరు 1న జరగాల్సిన కోర్టు వాదనల నుంచి కరోనా కారణంగా సల్మాన్​ తప్పించుకోగలిగాడు.

1998 అక్టోబరు 1న రాజస్థాన్​లోని జోధ్​పూర్​లో 'హమ్​ సాత్​ సాత్​ హై' సినిమా చిత్రీకరణ జరిపారు. ఈ షూటింగ్​ జరుగుతున్న క్రమంలో కృష్ణజింకలను వేటాడి కాల్చి చంపాడన్న ఆరోపణలతో సల్మాన్​ఖాన్​ను స్థానిక పోలీసులు అరెస్టు చేసి ఒక రోజు జైలులో ఉంచారు.

Last Updated : Dec 1, 2020, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.