ETV Bharat / sitara

కృష్ణ జింకల కేసులో సల్మాన్​కు కాస్త ఉపశమనం - సల్మాన్ ఖాన్ న్యూస్

జింకలు వేటాడిన కేసు హియరింగ్​కు సల్మాన్​ వర్చువల్​గా హాజరు కావొచ్చని న్యాయస్థానం తెలిపింది. ఇంతకీ ఈ కేసు ఏంటి? ఏం జరిగింది?

salman-khan-gets-big-relief-from-rajasthan-high-court-in-black-buck-hunting-case
కృష్ణ జింకల కేసులో సల్మాన్​కు కాస్త ఉపశమనం
author img

By

Published : Feb 5, 2021, 6:59 PM IST

కృష్ణజింకల కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్​ఖాన్​.. శనివారం(ఫిబ్రవరి 6) కోర్టుకు నేరుగా హాజరు కాకపోయినా అభ్యంతరం లేదని జోధ్​పుర్ న్యాయస్థానం చెప్పింది. దీంతో వర్చువల్​గా కోర్టు ముందుకు రానున్నారు సల్మాన్.

కరోనా కారణంగా కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ కేసు.. ఈ ఏడాది జనవరి 16న మళ్లీ హియరింగ్​కు వచ్చింది. ఆ రోజు సల్మాన్ కోర్టుకు హాజరు కాలేదు. కరోనా నేపథ్యంలోనే రాలేకపోతున్నానంటూ న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.

అసలు ఈ కేసు ఏంటి?

1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' షూటింగ్​లో భాగంగా చిత్రబృందం జోధ్​పుర్​ వెళ్లింది. ఆ ఏడాది అక్టోబరులో కృష్ణ జింకలను వేటాడినందుకు ట్రయల్ కోర్టు సల్మాన్​ఖాన్​కు 2018 మార్చిలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అతడొక్కడినే దోషిగా తేల్చింది.

అనంతరం జోధ్​పుర్ సెషన్స్ కోర్టుకు సల్మాన్ వెళ్లగా, స్టే ఇచ్చి షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది. అప్పటి నుంచి సల్మాన్​ బయటే ఉంటున్నారు.

ఇది చదవండి: హీరో సల్మాన్​ఖాన్​​ హత్యకు కుట్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.