షారుక్-సల్మాన్ కలిసి నటించనున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటికి పుల్‌స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సల్మాన్. బిగ్‌బాస్-14 వ్యాఖ్యాతగా ఉన్న ఆయన.. ఈ షో ముగిసిన తర్వాత షారుక్ 'పఠాన్' షూటింగ్లో పాల్గొంటానని అన్నారు.
యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'వార్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే 'పఠాన్'లో అతిథి పాత్రతో పాటు 'టైగర్' మూడో చిత్రం, 'కబీ ఈద్ కబీ దివాళి' కూడా చేయనున్నట్లు సల్మాన్ వెల్లడించారు.
ఇది చదవండి: కృష్ణ జింకల కేసులో సల్మాన్‌కు కాస్త ఉపశమనం