బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్. అతడ్ని కోల్పోవడం ఎంతో బాధకరమైన విషయమని అన్నారు. సుశాంత్ కుటుంబానికి అండగా నిలవాలని, తన అభిమానులను కోరారు.
-
A request to all my fans to stand with sushant's fans n not to go by the language n the curses used but to go with the emotion behind it. Pls support n stand by his family n fans as the loss of a loved one is extremely painful.
— Salman Khan (@BeingSalmanKhan) June 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">A request to all my fans to stand with sushant's fans n not to go by the language n the curses used but to go with the emotion behind it. Pls support n stand by his family n fans as the loss of a loved one is extremely painful.
— Salman Khan (@BeingSalmanKhan) June 20, 2020A request to all my fans to stand with sushant's fans n not to go by the language n the curses used but to go with the emotion behind it. Pls support n stand by his family n fans as the loss of a loved one is extremely painful.
— Salman Khan (@BeingSalmanKhan) June 20, 2020
"సుశాంత్ అభిమానుల అన్న మాటలు వెనుక భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం వల్ల కలిగే బాధ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అతడి కుటంబానికి, అభిమానులకు మీరు అండగా ఉండి, ధైర్యం చెప్పాలని నా ఫ్యాన్స్‌కు చెబుతున్నా"
-సల్మాన్‌ఖాన్, బాలీవుడ్ కథానాయకుడు
సుశాంత్ మరణానికి బాలీవుడ్‌లోని నెపోటిజమ్ ఓ కారణమని పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆరోపణలు చేశారు. అతడి ఆత్మహత్యకు హీరో సల్మాన్, నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, రియాచక్రవర్తి, నిర్మాత ఏక్తా కపూర్లు కారణమని బిహార్‌లోని ఓ న్యాయవాది సుధీర్‌కుమార్ ఓజా ఇటీవలే కోర్టులో కేసు వేశారు. బిహార్‌లోని ఓ విద్యార్థి సంఘం కూడా అతడి మృతికి నిరసన తెలుపుతూ సల్మాన్, కరణ్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు.
పలుకోణాల్లో దర్యాప్తు
సినిమా అవకాశాలు కోల్పోయానన్న బాధతోనే సుశాంత్ మరణించాడన్న ఆరోపణలు వినిపిస్తుండటం వల్ల బాలీవుడ్‌లోని లీడింగ్ ప్రొడక్షన్ హౌస్‌లను విచారిస్తున్నారు పోలీసులు. ఈ మేరకు సుశాంత్‌తో కాంట్రాక్ట్‌కు సంబంధించిన వివరాలు తెలియజేయాలని యశ్ రాజ్ ఫిలిమ్స్‌కు లేఖ పంపారు. తాజాగా ఈ కాంట్రాక్ట్ సంబంధించిన వివరాలను పోలీసులకు నివేదించింది యశ్‌రాజ్ ఫిలిమ్స్. ఈ నేపథ్యంలో ఇప్పటికే అతడి కుటుంబసభ్యులు, పనిచేసే సిబ్బంది, సన్నిహితులకు సంబంధించిన 15మంది వాంగ్మూలాలు తీసుకున్నారు పోలీసులు.
ఇది చూడండి :