బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్. ప్రస్తుతం వీరిద్దరూ 'సూర్యవంశీ', 'రాధే' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వీటికి సంబంధించిన విడుదల తేదీలను ఈరోజు ప్రకటించారు. పోలీస్‌గా అక్షయ్, మాస్ ఎంటర్టైనర్తో సల్మాన్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. హాలీవుడ్‌తో పాటు తెలుగులో తీస్తున్న 'మోసగాళ్లు'లోని సునీల్‌శెట్టి ఫస్ట్‌లుక్‌నూ ఈరోజే అభిమానులతో పంచుకున్నారు.
రంజాన్‌కు సల్మాన్
కండలవీరుడు సల్మాన్‌ఖాన్ 'రాధే'.. ఈద్ కానుకగా మే 22న థియేటర్లలోకి రానుంది. దిశాపటానీ హీరోయిన్. ప్రభుదేవా దర్శకుడు. సల్మాన్, సొహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
![salman khan, akshay kumar movies Are ready to release in this summer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6247720_1.jpg)
మార్చిలోనే 'సూర్యవంశీ'
అక్షయ్ కుమార్-రోహిత్‌శెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'సూర్యవంశీ'. వచ్చే నెల 2న ట్రైలర్.. 24న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో అక్షయ్.. పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నాడు. అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
![salman khan, akshay kumar movies Are ready to release in this summer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6247720_3.jpg)
సునీల్‌శెట్టి ఫస్ట్‌లుక్
మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా 'మోసగాళ్లు'. హాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఐటీ స్కామ్‌కు సంబంధించిన కథతో రూపొందిస్తున్నారు. ఇందులో ఏసీపీ కుమార్ పాత్ర పోషిస్తున్న సునీల్ శెట్టి ఫస్ట్‌లుక్‌ను నేడు విడుదల చేశారు. కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. జెఫ్రీ చిన్ దర్శకుడు.
![salman khan, akshay kumar movies Are ready to release in this summer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6247720_2.jpg)
ఇదీ చూడండి.. ఆ మూడు రోజులు 24x7 నాన్‌స్టాప్ షోలు